e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News రేపిస్ట్‌ రాజును పట్టిస్తే రూ.పది లక్షలు.. హైదరాబాద్‌ పోలీసుల సంచలన ప్రకటన!

రేపిస్ట్‌ రాజును పట్టిస్తే రూ.పది లక్షలు.. హైదరాబాద్‌ పోలీసుల సంచలన ప్రకటన!

హైదరాబాద్‌ : నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో బాలికపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు ఆచూకీ దొరక్క పోవడంతో మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడిని పట్టిస్తే రూ.10లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిస్తే ఈస్ట్‌ జోన్‌ డీసీపీ 94906 16366, టాస్క్‌ ఫోర్స్‌ 94906 16627 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లను తెలుపుతూ పోలీసులు రివార్డు ప్రకటించారు.

నిందితుడి వయసు 30 సంవత్సరాలని, ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, మెడలో భుజాలపై రెడ్‌ కలర్‌ స్కార్ఫ్‌ వేసి ఉంటుందని, రెండు చేతులపై మౌనిక అని టాటూ ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించడం.. బస్టాండ్లలో నింద్రించడం అలవాటు చేసుకున్నాడని తదితర వివరాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే నిందితుడి కోసం పోలీసులు పది బృందాలు ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana