అమరావతి : వినియోగదారులను ఆకట్టుకునేందుకు మార్కెట్లో ఉన్న అవకాశాలను వినియోగించు కుంటున్నారు వ్యాపారులు. అభిమాన హీరోలు నటించిన సినిమాతో వ్యాపారం పెంపొందించుకోవడానికి గుంటూరు జిల్లా దుగ్గిరాల శాఖకు చెందిన హెచ్పీ గ్యాస్ ఓనర్ వినూత్న అవకాశాన్ని వినియోగదారులకు ప్రకటించాడు. సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు మరో సిలిండర్ తీసుకుంటే ఉచితంగా ‘ఆర్ఆర్ఆర్ టికెట్లు అందజేస్తామని ఏజెన్సీ ఎదుట ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు.
దీంతో కొందరు అభిమానులు సిలిండర్ కొనుగోలుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ముగ్గురు వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారని ఏజెన్సీ నిర్వాహకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో బాహుబలి-2 చిత్రానికి కూడా ఇదే రీతిలో ఉచితంగా టికెట్లను పంపిణీ చేసి దుగ్గిరాల ప్రజలను ఆకట్టుకున్నాడు శ్రీనివాసరావు.