ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై తన తర్వాతి మ్యాచ్‌లో మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన కోల్‌కతా లీగ్‌లో బోణీ కొట్టింది.
లీగ్‌లో శుభారంభం చేయాలని పట్టుదలతో ఉన్న ముంబై ప్రాక్టీస్ సెషన్లో సాధన చేస్తోంది. ఎప్పుడూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే రోహిత్ ఈసారి కొత్తగా స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. చెన్నై పిచ్ ఎక్కువగా స్పిన్‌కు సహకరిస్తుండటంతో పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా రోహిత్ తదుపరి మ్యాచ్‌ల్లో అవసరమైనప్పుడు బౌలింగ్చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. హిట్‌మ్యాన్ బౌలింగ్ చేస్తున్న వీడియోను ఫ్రాంఛైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.