e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home News ఆర్‌యూబీ రోడ్‌ను వెంట‌నే తెర‌వాలి : ఎంపీ రంజిత్ రెడ్డి

ఆర్‌యూబీ రోడ్‌ను వెంట‌నే తెర‌వాలి : ఎంపీ రంజిత్ రెడ్డి

ఆర్‌యూబీ రోడ్‌ను వెంట‌నే తెర‌వాలి : ఎంపీ రంజిత్ రెడ్డి

హైద‌రాబాద్ : రైల్వే అండ‌ర్ బ్రిడ్జి రోడ్ల‌ను త‌క్ష‌ణ‌మే తెర‌వాల‌ని చేవెళ్ల‌ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా ఎంపీ రంజిత్‌రెడ్డి మంగ‌ళ‌వారం మాట్లాడుతూ తాండూరు రైత‌న్న స‌మ‌స్య‌ను కేంద్రం దృష్టికి తీసుకువ‌చ్చారు. తాండూరు పట్టణ శివారు ప్రాంతంలో చాలా మంది పేద రైతులు వ్యవసాయ, అనుబంధ రంగాలయిన పాడి, జీవాలు(గొర్రెలు-మేకలు) పెంచుకొని వచ్చిన ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. అయితే వీరంతా పశువులను మేపడానికి రోడ్ అండ్ రైల్వే బ్రిడ్జి మార్గం ద్వారా వెళుతుండే వారు. కాగా ఇటీవల స్థానిక రైల్వే అధికారులు ఈ మార్గాన్ని మూసివేశారు.

దీంతో వీరంతా ప్ర‌తిరోజూ దాదాపు 4 నుండి 5 కిలో మీటర్లు దూరం న‌డిచి వెళ్లాల్సి వస్తుంది. దీని వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు సాయిపూర్‌కు చెందిన రైతుల బృందం బాల్ రెడ్డి ఆధ్వర్యంలో స‌మ‌స్య‌ను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అదే రోజు సికింద్రాబాద్ రైల్వే జీఎంతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు. తాండూరు సాయిపూర్ రైతుల స‌మ‌స్య‌ను ఈవాళ పార్ల‌మెంట్ వేదిక‌గా ఎంపీ కేంద్రం దృష్టికి తీసుకువచ్చి ఆర్‌యూబీ రోడ్ తెర‌వాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
ఆర్‌యూబీ రోడ్‌ను వెంట‌నే తెర‌వాలి : ఎంపీ రంజిత్ రెడ్డి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement