దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కరోనా వలన పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది.
రీసెంట్గా చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొదలు పెట్టారు. కొద్ది సేపటి క్రితం ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూస్తేంటే ఆర్ఆర్ఆర్ చిత్రం నభూతో నభవిష్యత్ అన్న చందాన తెరకెక్కినట్టు అర్ధమవుతుంది. హాలీవుడ్ రేంజ్లో జక్కన్న సన్నివేశాలని చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్, రాజమౌళి అదరగొట్టారు. ఈ వీడియోని చూస్తుంటే ఆర్ఆర్ఆర్ టీం అభిమానులకి పసందైన వినోదం అందించడం ఖాయంగా కనిపిస్తుంది. చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటించగా, రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించింది. అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు.