అమరావతి : ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై ఘాటుగా ట్విట్ చేశారు. ‘ బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు..జగన్ అన్న ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు జ‘గన్’ అనే రియల్ సింహం అంటూ ట్విట్ చేశారు. తేడా వస్తే ‘దబిడి దిబిడే’ అంటూ బాలయ్య సినిమా డైలాగ్‌ను రిపీట్ చేశారు.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ పేరుగా మారుస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదించడాన్ని బాలకృష్ణ స్పందించారు. మహనీయుడు ఎన్టీఆర్ పెట్టి భిక్ష వల్ల విశ్వాసం లేని కుక్కలా నేడు వైసీపీలో ఉన్నారని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆమె ట్విటర్ ద్వారా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా ఏపీ మంత్రి జోగిరమేశ్ నిన్న బాలయ్య వ్యాఖ్యలపై తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.