ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలలో నేరుగా మదుపు ఒకప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లకు సాధ్యమయ్యేది కాదు. రిటైల్ డైరెక్ట్ గిల్ట్తో ఆ అవకాశం వచ్చింది. గతంలో మ్యూచువల్ ఫండ్ల ద్వారా మాత్రమే సాధ్యమయ్యేది.
రిటైల్ డైరెక్ట్ అంటే..
ప్రభుత్వ సెక్యూరిటీలలో ప్రైమరీ, సెకండరీ మార్కెట్ లావాదేవీల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు మదుపు చేసేలా వీలు కల్పించే వ్యవస్థ. ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్టేట్ డెవలప్మెంట్ రుణాలు వంటివి ఈ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 91 రోజులు, 182 రోజులు, 364 రోజుల ట్రెజరీ బిల్లులను కొనవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లనూ తీసుకోవచ్చు. వీటిని తనఖాపెట్టి రుణాలనూ పొందవచ్చు. మైనర్లు కూడా తమ గార్డియన్ల ద్వారా పొదుపు చేయవచ్చు. బహుమతులుగానూ ఇవ్వవచ్చు.