e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో 4-స్టార్స్ ను సొంతం చేసుకున్న రెనాల్ట్ ట్రైబర్…

గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో 4-స్టార్స్ ను సొంతం చేసుకున్న రెనాల్ట్ ట్రైబర్…

గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో 4-స్టార్స్ ను సొంతం చేసుకున్న రెనాల్ట్ ట్రైబర్…

ఢిల్లీ ,జూన్ 2: వినియోగదారుడి అభిరుచికి తగిన విధంగా ఉంటేనే ఏ వస్తువైనా మార్కెట్ లో హిట్ అవుతుంది. ముఖ్యంగా వాహనదారులు వాహనాన్ని కొనేముందు దాని మైలేజ్, ఫీచర్స్ , వారంటీ వంటివి మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ పై దృష్టిలో ఉంచుకుని వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా ఆధునిక కాలానికి అనుకూలంగానే మంచి సేఫ్టీ ఫీచర్స్ తో వాహనాలను విడుదల చేస్తున్నాయి.

భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో వున్నా అన్ని కార్లనుగ్లోబల్ ఎన్ సీఏపీ టెస్ట్ చేసి సురక్షితం అవునా, కాదా …? అనేది నిర్దారిస్తుంది. గ్లోబల్ ఎన్ సీఏపీ కార్ల తయారీదారులను, సురక్షితమైన కార్లను అభివృద్ధి చేయమని ప్రోత్సహిస్తుంది. గ్లోబల్ ఎన్ సీఏపీ ఇప్పటివరకు భారతదేశంలో చాలా కార్లకు క్రాష్ టెస్ట్ లు నిర్వహించింది.గ్లోబల్ ఎన్ సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్ కార్ల జాబితాలో టాటా ఆల్ట్రోజ్, టాటా టియాగో, టాటా నెక్సాన్, పోలో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి మరెన్నో కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నింటికీ క్రాష్ టెస్టులు నిర్వహించి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ , అంతకంటే ఎక్కువ రేటింగ్ అందించింది.

గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో 4-స్టార్స్ ను సొంతం చేసుకున్న రెనాల్ట్ ట్రైబర్…

ఇటీవల కాలంలో తాజాగా ఈ క్రాష్ టెస్ట్ జాబితాలో రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి చేరింది. దీనికి గ్లోబల్ ఎన్‌సిఎపి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. రెనాల్ట్ ట్రైబర్ 7-సీట్ల ఎమ్‌పివి గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయింది. ఇప్పుడు జరిపిన క్రాష్ టెస్ట్ లో ఇది 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. నివేదికల ప్రకారం గ్లోబల్ ఎన్‌సిఎపి #SaferCarsForIndia క్రాష్ టెస్ట్ లో ఈ కారు అడల్ట్ సేఫ్టీ విషయంలో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్, పిల్లల భద్రతలో 3-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కైవసం చేసుకుంది. మొత్తానికి ఇది సేఫ్టీ విషయంలో 4 స్టార్ రేటింగ్ పొందింది.రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ , సీట్ బెల్ట్ రిమైండర్ వంటివి స్టాండర్డ్ గా ఉంటాయి. క్రాష్ పరీక్షించిన మునుపటి రెనాల్ట్ ఉత్పత్తులతో పోలిస్తే రెనాల్ట్ ట్రైబర్ భద్రతా రేటింగ్ గణనీయమైన పెరుగుదలను చూపింది. కావున ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్లోబల్ ఎన్ సీఏపీ క్రాష్ టెస్ట్ లో 4-స్టార్స్ ను సొంతం చేసుకున్న రెనాల్ట్ ట్రైబర్…

ట్రెండింగ్‌

Advertisement