e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…

మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…

మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…

ఢిల్లీ, జూలై :ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా జస్ట్‌డయల్‌ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 800 నుంచి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్‌డయల్‌‌తో చర్చలు జరుపుతోంది. మన కరెన్సీలో రూ.6,600 కోట్ల వరకు ఈ డీల్ ఉండవచ్చు. ఈ డీల్ పూర్తయితే రిలయన్స్‌లోకి మరో కీలక సంస్థ వచ్చి చేరినట్లు అవుతుంది. ఇందుకు సంబంధించి రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రిలయన్స్ బోర్డ్ సమావేశం రేపు జరగనున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సెర్చ్ ఇంజిన్ సెగ్మెంట్‌లో జస్ట్‌డయల్ మార్కెట్ లీడర్‌గా వెలుగొందుతోంది. దీనికి సగటున మూడు నెలలకు150 మిలియన్ల విజిటర్లు ఉన్నారు. ఈ కంపెనీ మొబైల్, యాప్స్, వెబ్ సైట్, టెలిఫోన్ హాట్ లైన్ నెంబర్ 8888888888 తదితర ప్లాట్‌ఫాంలలో పనిచేస్తోంది. జస్ట్ డయల్ మేనేజింగ్ డైరెక్టర్ వీఎస్ఎస్ మణి, వీరి కుటుంబానికి ఈ కంపెనీలో 35.5 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వ్యాల్యూ ప్రస్తుతం రూ.2,387.9 కోట్లుగా ఉంది. జస్ట్ డయల్‌ను మణి నుంచి కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఆసక్తి చూపిస్తున్నది. అలాగే ఆ తర్వాత ఓపెన్ ఆఫర్ ద్వారా మరో 26 శాతం వాటాను దక్కించుకోనుంది. అదే జరిగితే రిలయన్స్ వాటా 60 శాతానికి చేరుకుంటుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…
మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…
మరో కంపెనీని చేజిక్కించుకోనున్న రిలయన్స్…

ట్రెండింగ్‌

Advertisement