హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వర్షాలు ముఖం చాటేడంతో ప్రాజెక్టుకు ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 50,980గా ఉన్నది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 598.60 అడుగుల మేర నీరుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ఇప్పుడు జలాశయంలో 310.84 టీఎంసీల నీరు నిల్వ ఉంది.