తాత్కాలిక పద్ధతిన దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 8 వైద్య కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 15 విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వైద్యవిద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. తాత్కాలిక పద్ధతిలోనే నియామకాలు ఉంటాయని, ఏడాదిపాటు ఒప్పందం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన తుది జాబితాను 31న ప్రకటిస్తారు. వచ్చే నెల 7లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు మెడికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
పోస్ట్ వేతనం
ప్రొఫెసర్ రూ.1.90 లక్షలు
అసోసియేట్ ప్రొఫెసర్ రూ.1.50 లక్షలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1.25 లక్షలు