ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో సరికొత్త ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. రియల్మీ C20A పేరుతో విడుదలైన ఫోన్ ధర 10వేల లోపే. ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో G35 SoC చిప్సెట్, 5000mAh బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐతే ఈ ఫోన్ను ప్రస్తుతం బంగ్లాదేశ్లో లాంచ్ చేశారు. బంగ్లాలో 2GB + 32GB సీ20ఏ మోడల్ ధర 7,800గా నిర్ణయించారు. భారత్లో ఇలాంటి ఫీచర్లతో ఇదివరకే రియల్మీ సీ20 ఫోన్ను ఆవిష్కరించింది. రియల్మీ సీ20 ఫోన్ను ఏప్రిల్లో భారత్లో విడుదల చేశారు. దీని ధర రూ. 6,999.
Realme C20A స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: 6.50 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ఫ్రంట్కెమెరా: 5 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 8 మెగా పిక్సెల్
ర్యామ్: 2జీబీ
స్టోరేజ్: 32జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 5000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10