ఢిల్లీ,జూన్ 29: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్-మీ గత వారం విపణిలోకి విడుదల చేసిన సరికొత్త ఉత్పత్తులఅమ్మకాలు ఇవాళ ఆన్ లైన్ లో ప్రారంభమయ్యాయి. రియల్-మీ డాట్ కామ్, ఫ్లిప్ కార్ట్ డాట్ కామ్ వెబ్సైట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రియల్-మీ నార్జో 30 4జి,రియల్-మీ నార్జో 30 5జి,రియల్-మీ బడ్స్ క్యూ 2,రియల్-మీ స్మార్ట్ టివి ఎఫ్హెచ్డిలను ఇండియాలో ప్రారంభించిన విషయం తెలిసిందే..
రియల్-మీ నార్జో 30 బేస్ వేరియంట్ 4 జీబీ ర్యామ్,64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.12,499 ,6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.14,499 ధర గా నిర్ణయించింది. మరోవైపు రియల్-మీ స్మార్ట్ టీవీ ధర రూ.18,999. ప్రారంభ ఆఫర్‌గా ప్రకటించింది. ఈ రోజు రియల్-మీ నార్జో 30 కొనుగోలుదారులకు స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.500 తగ్గింపు లభిస్తుండగా,రియల్-మీ స్మార్ట్ టీవీపై రూ .1000 తగ్గింపు అందిస్తున్నారు.