e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…

మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…

మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…

ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు జిటి 5జి ఉత్పాదనలతో పాటు,రియల్ మి జిటి 5జి సిరీస్ ను మూడో త్రైమాసికంలో భారతీయ మార్కెట్ కు తీసుకురానుంది. దేశంలో 5జి ని అనుసరించేందుకు గాను పలు కార్పొరెట్ కార్యక్రమాలను కూడా రియల్ మీ ఇండియా చేపట్టింది. చిప్ సెట్ తయారీ సంస్థలు, పరిశ్రమ భాగస్వాములతో కలసి వచ్చే ఏడాదిలో రూ.10 వేల లోపు 5జి స్మార్ట్ ఫోన్లను తీసుకురావడం తన లక్ష్యంగా రియల్ మి ప్రకటించింది.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2021 మే లో నెంబర్ వన్ 5జి స్మార్ట్ ఫోన్ గా నిలిచిన రియల్ మి పలు 5జి అంశాలపై పరిశ్రమ ప్రముఖులతో ఒక వెబినార్ ను నిర్వహించింది. ‘భారత్ లో 5జి : సమాన అనుభూతులు, యాక్సెసబిలిటీ’ అనే అంశంపై ఈ చర్చ జరిగింది. భారత్ కు సంబంధిం చి 5 జి అంచనాలు, భారత్ లో 5జి విస్తరించగలిగే సామర్థ్యం లాంటివి అంతర్జాతీయ 5జి షిప్ మెంట్స్ కు చోదకశక్తిగా ఉన్నాయి.

మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…
- Advertisement -

అధునాతన చిప్ సెట్స్ తో ఫ్యూచర్ ప్రూఫింగ్ స్మార్ట్ ఫోన్స్, 5జి కమర్షియల్ రోల్ అవుట్స్, 5జి యాక్సెసబిలిటీ లాంటివన్నీ భారత్ ను 5జి పవర్ హౌజ్ గా చే యనున్నాయి. 5జిని అనుభూతి చెందడంలో 5జి ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యం, యూజర్లకు 5జి స్మార్ట్ ఫోన్లు అందించే ప్రయోజనాలు, నూతన సామర్థ్యాలను వాడుకలోకి తీసుకువచ్చేందు కు అవసరమైన 5జి ఎనేబుల్డ్ మౌలిక వసతులు, ఏ ఐ ఓటి వంటి అంశాలపై చర్చ జరిగింది. భారతదేశంలో మొబైల్ ఆపరేటర్ నెట్ వర్క్ పై ఇప్పటికే 50 లక్షల 5జి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని సిఒఎఐ ఈ వెబినార్ ద్వారా తెలియజేసింది. కొనుగోలుదారుల అంచనాలను చేరుకునేందుకు వీలుగా భాగస్వాములతో సన్నిహితంగా కలసి పని చేస్తున్నట్లు మీడియాటెక్ తెలిపింది.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఇండస్ట్రీ 4.0,క్లౌడ్ కంప్యూటింగ్, ఓపెన్ సోర్స్, డేటా ప్రొటెక్షన్ అండ్ ప్రైవసీ, యాప్ ఎకానమీ లతో కలిపి 5జి అభివృద్ధికి అనేక కొత్త అవకాశాలు ఉన్నాయని ప్యానలిస్టులు పేర్కొన్నారు. 2021 మే నెలలో విక్రయమైన స్మార్ట్ ఫోన్లలో సుమారుగా 14శాతం ఫో న్లు 5జి ఉపకరణాలని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ప్రపంచంలో భారతదేశం రెండో అతిపెద్ద మార్కెట్ అయినప్పటికీ, ఇంకా అది పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ముందుకెళ్లేందుకు ఇంకా 50 శాతం దాకా అవకాశాలున్నాయని పేర్కొంది.

రానున్న ఐదేండ్లలో దేశంలో కోట్లాది రూపాయల విలువైన స్మార్ట్ ఫోన్లు విక్రయం కానున్నాయని కూడా కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 5జిలో ప్రజాదరణ పొందిన సంస్థగా కావడం పట్ల తన కట్టుబాటును రియల్ మి ఈ వెబినార్ సంద ర్భంగా పునరుద్ఘాటించింది. భారతీయ మార్కెట్ లో 5జి ని మరింత ముందుకు తీసుకెళ్లనున్న ట్లు, భారత్ తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతికతను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

‘‘డిజిటల్ అంతరాన్ని తొలగించగల తిరుగులేనిది 5జి. 5జి లీడర్ కావాలన్నది రియల్ మి ఆశయం. 2021 నుంచి ప్రతి భారతీయుడు కూడా 5జి ఫోన్ పొందాలని అది ఆకాంక్షిస్తోంది. 2021అనంతరం భారత్ లో 5జి మొదలుకానుంది.అంతర్జాతీయంగా 5జి ప్రజాస్వామీకరణలో మేం ముందంజలో ఉన్నాం. మా 5జి ఫోన్లతో మేం నిరంతరం మరెన్నో ఆశ్చర్యాలను అందించనున్నాం. మరెంతో మంది భారతీయ వినియోగదారు లకు మార్కెట్లో అత్యుత్తమ అనుభూతిని అందిస్తాం” అని రియల్ మి వైస్ ప్రెసిడెంట్,రియల్ మి ఇండియా,యూరప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాధవ్ సేత్ అన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…
మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…
మూడో త్రైమాసికంలో రియల్-మీ జీటీ 5జీ సిరీస్…

ట్రెండింగ్‌

Advertisement