టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పుష్పరాజ్ అవతారమెత్తాడు. అచ్చం పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ను తలపిస్తూ అదిరిపోయే స్టిల్‌తో ఆకట్టుకున్నాడు. మట్టికొట్టుకుపోయిన బట్టలు, చింపిరి జట్టు నోట్లో బీడీతో ఉన్న ఫొటోను జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ధూమపానాన్ని వ్యతిరేకించే జడేజా..ఇది గ్రాఫికల్ డిజైన్ అంటూ పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని పేర్కొన్నాడు.