టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఫన్నీ వీడియోలు చేస్తూ సరదాగా గడపడం స్టార్ ఓపెనర్ ధవన్‌కు బాగా అలవాటు. తాజాగా రవీంద్ర జడేజాతో కలిసి అతను చేసిన రీల్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న జడ్డూ.. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు.
ఆసియా కప్ మధ్యలో మోకాలి గాయంతో జట్టులో నుంచి తప్పుకున్న జడ్డూ.. శస్త్రచికిత్స తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో కూడా బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు. అలాగే ధవన్‌ను కూడా సెలెక్టర్లు పక్కనపెట్టారు. అతన్ని కేవలం వన్డేలకే పరిమితం చేయాలని బీసీసీఐ ప్లాన్‌లా కనిపిస్తోంది.
ఈ క్రమంలో తను కూడా ఎన్సీయేలోనే ఉన్న ధవన్ ఒక రీల్ షేర్ చేశాడు. దీనిలో జడేజా కాలికి ఒక బెల్ట్ వేస్తుండగా.. పక్కనే నిలబడిన ధవన్ ఎగిరి గంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇది చూసిన జడ్డూ హిందీలో ఫేమస్ డైలాగ్.. ‘ఇస్కీ షాదీ కర్వా దీజియే. జిమ్మెదారీ ఆయేగీతో సుధర్ జాయేగా’ (వీడియా త్వరగా పెళ్లి చేసేయండి. బాధ్యతలు వస్తే బాగు పడతాడు) అనే డైలాగ్‌కు లిప్ సింక్ ఇచ్చాడు. ఈ రీల్ చూసి నెటిజన్లే కాదు.. సహచర ఆటగాళ్లు కూడా నవ్వుకుంటున్నారు.