ఛలో, గీతగోవిందం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna). నిను చూస్తూ ఉంటే కన్నులు రెండూ తిప్పేస్తావే..నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే..చూపే బంగారమాయేనె శ్రీవల్లి..మాటే మాణిక్యమాయేనె అంటూ పుష్ప సినిమాలో వచ్చే పాట ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
తాజాగా రష్మిక నెట్టింట పోస్ట్ చేసిన ఫొటోలు చూసి ఇదే పాట పాడుకుంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. వైట్ మోనోక్రోమ్ కాస్ట్యూమ్స్‌లో దిగిన ఫొటోలు ఇపుడు ఇంటర్ నెట్‌ను సేక్ చేస్తున్నాయి.
రీసెంట్గా సీతారామంలో కీ రోల్ పోషించింది రష్మిక. మరోవైపు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్న గుడ్‌బై అక్టోబర్ 7న విడుదలవుతుంది. దీంతోపాటు మిషన్ మజ్ను, వారసుడు, పుష్ప..ది రూల్ సినిమాలు రష్మిక ఖాతాలో ఉన్నాయి.
రష్మిక ఫోజులపై ఓ లుక్కేయండి మరి..