రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస దర్శకుడు. మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మాత. ప్రస్తుతం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుండి తాజాగా ‘అరే చెప్పకు రా మామ నువ్వు చెప్పకు సారీ’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి.
దర్శకుడు మాట్లాడుతూ ‘మా చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి పాటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదల చేసిన పాటకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రం కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: బెక్కెం వేణుగోపాల్