సీనియర్ హీరో కృష్ణ మనవడు గల్లా అశోక్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గల్లా పద్మావతి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలోని ‘అచ్చ తెలుగందమే..’ అనే లిరికల్ వీడియోను సోమవారం హీరో రానా విడుదల చేశారు. జిబ్రాన్ సంగీతాన్నందించిన ఈ గీతాన్ని సిధ్‌శ్రీరామ్ ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందించారు. ‘వినూత్న కథాంశమిది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. వినోదానికి పెద్దపీట వేశాం’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్యపాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ప్రసాద్, సంభాషణలు: కల్యాణ్‌శంకర్, ఏఆర్ ఠాగూర్, నిర్మాణ సంస్థ: అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.