Rana Daggubati | ఈ ఏడాది రానానాయుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలుకరించాడు రానా (Rana Daggubati). విరాట పర్వం తర్వాత మరే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. ఇటీవలే డైరెక్టర్ తేజ మరోసారి రానాతో సినిమా చేయబోతున్నానని, రాక్షస రాజు అనే టైటిల్ కూడా ఫైనల్ చేశామని చెప్పేశాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ (Prabhas) సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ K (Project-K)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రానా. ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. మనం (సౌతిండియన్స్) ఒకరి సినిమాను మరొకరు సెలబ్రేట్ చేసుకుంటాం. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా దీపికాపదుకొనే, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ప్రాజెక్ట్ K వస్తుంది.
తెలుగులో మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టి.. సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. సరిహద్దులను దాటి స్థాయికి వెళ్తుంది. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. తెలుగు నుంచి ప్రాజెక్ట్ K మరో గ్లోబల్ సినిమాగా మారబోతుంది.. అని చెప్పుకొచ్చాడు. తన బాహుబలి కోస్టార్ ప్రభాస్ సినిమాపై రానా చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ప్రాజెక్ట్ Kలో బాలీవుడ్ భామ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన లుక్స్ సినిమా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందని చెబుతున్నాయి.