అమరావతి : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నేడు రంజాన్ పండుగను జరుపుకొంటున్న ముస్లిం సోదరులు రంజాన్ శుభాకాంక్షలు అంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. మత గురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షను కొనసాగించిన వారందిరికీ సలాం తెలిపారు .
ఒకవైపు ఆద్యాత్మికత, మరోవైపు సర్వమానవ సమానత్వం, సేవాభావం చాటి చెప్పేదే రంజాన్ పండుగ అని అన్నారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.