e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News ఎమ్మెల్సీ ప‌ద‌వి అంటేనే రాంచంద‌ర్‌రావుకు చిన్న‌చూపు

ఎమ్మెల్సీ ప‌ద‌వి అంటేనే రాంచంద‌ర్‌రావుకు చిన్న‌చూపు

హైద‌రాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. న‌గ‌రంలోని మల్కాజ్‌గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా స‌మావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సురభి వాణీ దేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయన్నారు. రాంచందర్ రావు  పట్టభద్రులను చిన్న చూపు చూశారన్నారు. 2018లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా పోటీ చేశారు. అంటే గెలిస్తే మధ్యలో ఈ పదవి వదిలి వెళ్లిపోయేవాడేగా అన్నారు. పట్టబద్రులకు సేవ చేయాలని అనుకుంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు ఎందుకు పోటీ చేసినట్లు అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ మధ్యలో వదిలి వెళ్లిపోవన్న గ్యారంటీ ఏంటి అన్నారు. సురభి వాణి దేవి మాజీ ప్రధాని కూమార్తెగా, సంప్రదాయ కుటుంబం నుంచి వ‌చ్చిన‌ వ్యక్తి. విద్యావేత్త. విద్యారంగంలో ఎంతో సేవ చేసిన వ్యక్తి. లెక్చరర్, ఫ్రోఫెసర్, కరస్పాండెంట్‌గా లక్ష మంది పట్టభద్రులను సమాజానికి అందించారు. ఆమెను గెలిపించాల్సిందిగా కోరారు. 

ఏ ప్రాతిప‌దిక‌న బీజేపీకి ఓటేయాలి..

బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి ? అసలు బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పమనండి. ఏ ప్రాతిపదికన బీజేపీ ఓటు అడుగుతోందో చెప్పాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధ‌రలు పెంచినందుకు ఓటు వేయమని అడుగుతున్నారా ? సంవత్సరానికి 225 రూపాయలు గ్యాస్ ధర పెంచినందుకు ఓటు వేయాలా..? విభజన హామీ చట్టంలో పేర్కొన్న ఒక్క హమీ నెరవేర్చనందుకు ఓటు వేయాలా..? హక్కుగా రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రానందుకు బీజేపీకి ఓటు వేయాలా..? గిరిజన యూనివర్సిటీ ఇస్తామని చెప్పి ఇవ్వనందుకా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు, ఐటీఐఆర్ రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టినందుకా? ప్రభుత్వరంగ సంస్థలు అమ్మేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు  రిజర్వేషన్లు ఊడగొడుతునందుకా? ప్రపంచంలో పెద్దదైన ఎల్. ఐ. సీ, రైల్వేలను ప్రైవేటుపరం చేస్తునందుకా? బీఎస్ఎన్ఎల్‌లో 50 శాతం ఉద్యోగాలు ఊడగొట్టి ప్రైవేటుప‌రం చేస్తునందుకు బీజేపీకి ఓటు వేయాలా? అని ప్ర‌శ్నించారు. 

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement