The Warriorr Movie | రామ్ పోతినేని హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది వారియర్’. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ యాక్షన్ సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. కాగా ఈ సారి కొంచెం స్టైలిష్‌గా ఖాకి యూనిఫార్మ్ వేసుకుని విలన్లను చిత్తు చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూలై 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 2గంటల 35నిమిషాల రన్ టైంను మేకర్స్ లాక్ చేశారు. కృతి శెట్టీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలన్ని చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా బుల్లెట్ పాట మిలియన్ల వ్యూస్ సాధిస్తూ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.