శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన రెడీ చిత్రంలో రామ్ పోతినేని, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాటైం నుండి జెనీలియాకు, రామ్‌కు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇప్పటికీ వారు తరచు కలుస్తూ ఉంటారు. తాజాగా రామ్, జెనీలియా ఏదో సందర్భంలో కలవగా వీరిద్దరు కలిసి తెగ సందడి చేసారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు జెనీలియా.
ఇటీవల స్కేటింగ్ చేస్తూ గాయపడ్డ జెనీలియా చేతి కట్టుతోనే రామ్‌తో కలిసి ఫన్ చేసింది. ఇద్దరు కలిసి రీల్ చేద్దామనుకుంటే అది ఏదో అయింది. జెనీలియా షేర్ చేసిన వీడియోకు కామెంట్‌గా .. అయ్యో అయ్యో అయ్యో బాబు గారు ఫస్ట్ టైమ్ రీల్ చేస్తున్నారు కదా అందుకే సిగ్గు పడుతున్నాడు. రామ్ నువ్వు చాలా క్రేజీ పర్సన్‌వి అని కామెంట్ పెట్టారు. ఈ వీడియో అటు జెనీలియా అభిమానులతో పాటు ఇటు రామ్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది .