చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలకు కోట్లలో బిజినెస్ జరుగుతుంది. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ మూగ పాత్ర పోషించి నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ త్వరలో శంకర్‌తో కలిసి పవర్ ఫుల్ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
రేపు రామ్ చరణ్ బర్త్ డే కాగా, అభిమానులు ఓ రోజు ముందు నుండే నానా హంగామా చేస్తున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన స్పెషల్ బర్త్‌డే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ వీడియో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక మరి కొద్ది నిమిషాలలో ఆర్ఆర్ఆర్ నుండి స్పెషల్ సర్ప్రైజ్ రానుండడంతో ఫ్యాన్స్ దాని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రేపు ఆచార్య నుండి సిద్ద లుక్కు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.