గత వారం రోజులుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుక హంగామా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అభిమానులు రామ్ చరణ్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇక గత రాత్రి శిల్పకళా వేదికలో భారీ ఎత్తున బర్త్డే వేడుక ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, బుచ్చి బాబు, బిగ్ బాస్ ఫేం దివి హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి.
ఇక ఆర్ఆర్ఆర్ సెట్లోను రామ్ చరణ్ బర్త్డే హంగామా ఓ రేంజ్లో జరిగింది. రాజమౌళి, డీవీవీ దానయ్యతో పాటు పలువురు యూనిట్ సభ్యుల సమక్షంలో రామ్ చరణ్ కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చెర్రీ బర్త్డే సందర్భంగా ఆర్ఆర్ఆర్, ఆచార్య నుండి సర్ప్రైజింగ్ పోస్టర్స్ విడుదల చేయగా, ఇవి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశాయి.