వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Shaking Dance). తెలుగులో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ అయిపోయింది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ (Bollywood)పై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. హిందీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది రకుల్. నెట్టింట్లో చురుకుగా ఉండే ఈ భామ ఎప్పుడూ ఏదో ట్రెండీ అప్డేట్ను ఇస్తూ..అభిమానులు ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఫేవరేట్ ట్రాక్‌కు ఇరగదీసే డ్యాన్స్ చేసి ఔరా అనిపిస్తోంది. ఇంతకీ ఈ సైజ్‌జీరో సుందరి ఏ పాటకు డ్యాన్స్ చేసిందో తెలుసా..? వరల్డ్ నంబర్ 1 ట్రెండింగ్ సాంగ్ పసూరి (Pasoori)కి బ్లాక్ డ్రెస్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది. ప్రస్తుతం నాకు ఇష్టమైన పాట, ఉత్తమమైనదిగా చేసిన సెలబ్రిటీ డ్యాన్స్ కోచ్ డింపుల్ కొటేచా (dimplekotecha)కు ధన్యవాదాలు..అంటూ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది రకుల్. ఇపుడీ డ్యాన్స్ వీడియో నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంటోంది.
రకుల్ నటించిన అటాక్, రన్ వే 34 చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ప్రస్తుతం ఛత్రివాలి, మిషన్ సిండ్రెల్లా, థ్యాంక్ గాడ్ చిత్రాల విడుదల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్(Tollywood) లో స్టార్ హీరోయిన్ల అవసరం ఎక్కువగానే ఉన్నప్పటికీ రకుల్‌ను మాత్రం ఎవరు సంప్రదించడం లేదనే టాక్ కూడా ఉంది.