Pawan Kalyan | రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో పవన్ కళ్యాణ్ నటించి ఉంటే ఎలా ఉండేదన్న ఆలోచనే క్రేజీగా అనిపించవచ్చు. ఇప్పుడు కుదరదు గానీ నాలుగేళ్ల క్రితం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఇది అసాధ్యమయితే కాదు. ఆర్ఆర్ఆర్ కథా చర్చల సమయంలో ఒక హీరోగా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావనకు వచ్చిందట. ఆశ్చర్యపరిచే ఈ విషయాన్ని రచయిత విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సాధారణంగా రాజమౌళి కుటుంబంలో ఎవరూ సినిమా వెనక జరిగే విషయాలను ఎక్కువగా మాట్లాడరు. సినిమా ప్రమోషన్ కోసం ఏది మాట్లాడితే మంచిదో అంత వరకే చెప్తారు. కానీ విజయేంద్రప్రసాద్ ఓపెన్ గా మాట్లాడేస్తుంటారు. సినిమా బ్యాక్ స్టోరీస్ చాలా చెప్తారు. ఈయన ద్వారా రాజమౌళి, కీరవాణి గురించి ఆసక్తికర విషయాలు బయటకొస్తుంటాయి. అడిగితే మహేష్ బాబు రాజమౌళి మూవీ గురించి కూడా విజయేంద్రప్రసాద్ చెప్పేస్తారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చర్చల సమయంలో పవన్ గురించి ప్రస్తావన వచ్చినట్లు ఈ స్టార్ రైటర్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ ను ఇద్దరు హీరోల్లో ఒకరిగా తీసుకుంటే ఎలా ఉంటుందని రాజమౌళి ఆలోచించాడట. అయితే ఆయన ఇమేజ్ ను స్టార్డమ్ ను మ్యాచ్ చేయగల మరో హీరో ఎవర్ని తీసుకోవాలన్నదే పెద్ద ప్రశ్నగా మారిందట. దాంతో చరణ్, ఎన్టీఆర్ కథకు సరిపోతారని నిర్ణయించుకున్నారట. స్వతహాగా పవన్ ను ఇష్టపడుతుంటారు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు. గతంలో రాజమౌళి, పవన్ కాంబినేషన్ సినిమా కోసం ప్రయత్నాలు జరిగి, సఫలం కాలేదు. ఆర్ఆర్ఆర్ పవన్ చేసి ఉంటే ఆ సినిమా స్థాయి మరింత పెరిగేది అనేది నిజం.