హైదరాబాద్ : నగరంలో సోమవారం పలు చోట్ల వర్షం కురిసింది. చార్మినార్, బహదుర్‌పురా, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, చంపాపేట, సరూర్‌నగర్, హయత్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కొంపల్లి, సిక్రిందాబాద్, బోయిన్పల్లి, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీసెంటర్, చిలుకలగూడలో వాన కురిసింది. ఒక్కసారిగా వానపడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్‌లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది.