హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి తూర్పు, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అదేవిధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1-5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని వాతావరణ శాఖ పేర్కొంది.