హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం వర్షం కురిసింది. కొత్తపేట, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, అల్కాపురి, నాగోల్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ గాంగ్టక్ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని తెలిపింది.