న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం కోరనా నివారణలో విఫలమైందని ఆరోపించే పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ లో ఆ పోస్టర్ల కాపీలను పెట్టి “నన్ను కూడా అరెస్టు చేయండి” అని సవాల్ చేశారు. ఆదివారం ఆయన ట్విట్టర్ లో హిందీ, ఇంగ్లిష్లో “మోదీజీ, ఆప్నే హారే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ క్యూ భేజ్ దియా (మోదీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?) అనే నినాదాలు రాశారు. పైన నన్ను కూడా అరెస్టు చేయండి (ముఝే భీ గిరఫ్తార్ కరో) అని హిందీలో రాశారు. ఇలాంటి పోస్టర్లు ఢిల్లీలో ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు.