శ్రీశైలం : భ్రమరాంబమల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు మంగళవారం దర్శించుకున్నారు. మంగళవారం క్షేత్రానికి చేరుకున్న ఆయనకు ఆలయ ప్రధాన గోపురం నుంచి ఈఓ కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చక వేదపండితులు తిలక ధారణ చేసి ఉభయ దేవాలయాల్లో స్వామి.. అమ్మవార్ల దర్శనాలు చేయించారు. అమ్మవారి ప్రాకార మండపంలో తీర్థ ప్రసాదాలతో పాటు స్వామి అమ్మవార్ల ఆశీర్వచనాలు అందించారు.