ఏకంగా 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించిన నాదల్.. ఇక అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతాడని వచ్చే రూమర్లపై స్పందించాడు. కోర్ట్ ఫిలిప్ప్ ఛాట్రియర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-3, 6-0 తేడాతో క్యాస్పర్ రూడ్‌ను ఓడించాడీ స్పెయిన్ బుల్. దీంతో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌ను మరింత వెనక్కు నెట్టాడు.
ఈ ఫైనల్ సందర్భంగా కూడా కాలు నొప్పితో బాధపడిన నాదల్.. త్వరలోనే రిటైర్ అవుతాడని రూమర్లు మొదలయ్యాయి. వీటిపై స్పందించన నాదల్.. ‘‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేను మాత్రం ముందుకు సాగుతూనే ఉంటా. ఇంత మంది మద్దతుతో ఇక్కడ ఆడటం నాకు చాలా మంచి అనుభూతిని ఇస్తుంది’’ అని వివరించాడు.
ప్యారిస్‌లో జరిగిన అన్ని మ్యాచులకు ముందు పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్లు చేయించుకోవాల్సి వచ్చిందని అంగీకరించాడీ దిగ్గజం. దీనికి మళ్లీ స్పెయిన్‌లో చికిత్స తీసుకుంటానని, అది వర్క్ అయితే మళ్లీ ఆడుతూనే ఉంటానని, లేదంటే దానిపై అప్పుడు ఆలోచిస్తాని అన్నాడు. తన శరీరం సహకరించేంత వరకు ఆడుతూనే ఉంటానని పేర్కొన్నాడు.