పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ దిగ్గజం రఫేల్ నాదల్.. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకొని నాలుగో ర్యాంక్‌కు చేరాడు. నొవాక్ జొకోవిచ్ టాప్‌లో కొనసాగుతుండగా.. మెద్వెదెవ్, జ్వెరెవ్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నార్వే ఆటగాడు కాస్పర్ రూడ్‌ను చిత్తు చేసిన నాదల్.. కేరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. రన్నరప్‌గా నిలిచిన రూడ్ రెండు ప్లేస్‌లు మెరుగు పర్చుకొని ఆరో స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన అమెరికా యువ సంచలనం కోకో గాఫ్.. కెరీర్లో అత్యుత్తమంగా 13వ స్థానానికి చేరింది. స్వియాటెక్ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.