R.R.R Pre-release Business | ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎక్కడ చూసినా ట్రిపుల్ఆర్ సందడే. అసలు హీరో, కథతో సంబంధంలేకుండా పోస్టర్ మీద రాజమౌళి పేరు ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ట్రిపుల్ఆర్ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ అంతకంతకు అంచనాలను పెంచుతున్నాయి. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి నటిస్తుండటంతో అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులలో పండగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రాన్ని అత్యంత భారీగా మార్చి25న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా నిర్మాత ఈ చిత్రాన్ని దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. దానికి తగట్లుగానే ఈ చిత్రం ప్రీ రీలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే కొన్ని ఏరియాలలో ప్రీ టిక్కెట్ సేల్స్‌తో బాహుబలి-2 రికార్డును ట్రిపుల్ఆర్ బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా ఏరియావైజ్ బిజినెస్ ఒకసారి గమనిస్తే..
నైజాం : 70 కోట్లు
సీడెడ్ : 37 కోట్లు
ఉత్తరాంధ్ర : 22 కోట్లు
ఈస్ట్ : 14 కోట్లు
వెస్ట్ : 12 కోట్లు
గంటూరు : 15 కోట్లు
కృష్ణా : 13 కోట్లు
నెల్లూరు : 8.0 కోట్లు
కర్ణాటక : 41కోట్లు
తమిళనాడు : 35 కోట్లు
కేరళ : 9.0 కోట్లు
హిందీ : 92 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 8.0 కోట్లు
ఓవర్సీస్ : 75 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ : 451 కోట్లు
రాజమౌళి గత చిత్రం ‘బాహుబలి’ సినిమాకు దాదాపు 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ‘ట్రిపుల్ఆర్’ చిత్రానికి 100కోట్లకు పైగా పెరిగి 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే 455 కోట్ల షేర్‌ను సాధించాల్సి ఉంటుంది. ఇక ట్రేడ్ పండితులు ఈ చిత్రం 1000కోట్లను కలెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఆలీయాభట్, ఒలివియా మొర్రిస్లు కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:
Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్‌లో.. దిశా పటాని?
Keerthi Suresh | రివేంజ్ కథతో కీర్తీసురేష్.. ఈ సారైనా హిట్టుకొడుతుందా?
N.T.R | ఆ పాటంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టమట!
Liger | రౌడి హీరోతో ప్రియా వారియర్.. పూరి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?