హైదరాబాద్, మే 4: ప్రపంచంలోనే అత్యంత వృద్ధిపథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ క్వాలీజీల్.. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించింది. అమెరికా తర్వాత సంస్థకు ఇదే తొలి సెంటర్ కావడం విశేషం. బుధవారం ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. ఇందులో 250 మంది టెక్నికల్ ఉద్యోగులు పనిచేయనున్నారు. వచ్చే రెండేండ్లలో 1,500 మందికి పెంచుకోనున్నట్టు సంస్థ తెలిపింది.