కరోనా కట్టడికి పుతిన్ నిర్ణయం
మాస్కో, అక్టోబర్ 20: దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులకు ముకుతాడు వేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 30 నుంచి వారంపాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు రావొద్దని, ప్రజలందరూ బాధ్యతగా వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు.