e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home News దొరికిపోయాడు..ఆడేసుకుంటున్నారు

దొరికిపోయాడు..ఆడేసుకుంటున్నారు

దొరికిపోయాడు..ఆడేసుకుంటున్నారు

స్టార్ల నుంచి సామాన్యుల వరకు టాలీవుడ్‌ లో ఎవరు ఎలా ఎక్కడినుంచి కాపీ చేశారన్నది రుజువులతో సహా బయటపెడుతున్నారు కొందరు. ఈ కల్చర్‌ ఈ మధ్యన బాగా ఎక్కువైంది. ఇప్పుడలాంటి కాపీ ఆరోపణల్లో ఇరుక్కున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న పుష్ప టీజర్‌ ఈ కాంట్రవర్సికి కారణమైంది. బన్నీ బర్త్‌ డే కానుకగా విడుదల చేసి ఈ టీజర్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌ లో ఉంది. అయితే ఇందులోని మ్యూజిక్‌ కాపీ కొట్టారంటూ కొందరు వార్తలు వైరల్‌ చేస్తున్నారు.

హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో ఓ సందర్భంలో వచ్చే బీజీఎమ్‌ ని కాస్త మార్చి పుష్ప టీజర్‌ బీజీఎంగా పెట్టేశారని సోషల్‌ మీడియాలో వార్తలు హడావుడి చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను అల్లు, దేవి ఫ్యాన్స్‌ కొట్టిపారేస్తున్నారు. పుష్ప టీజర్‌ రికార్డ్‌ లు క్రియేట్‌ చేస్తోందన్న అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.

Advertisement
దొరికిపోయాడు..ఆడేసుకుంటున్నారు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement