లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలలో రూపొందుతున్నచిత్రం పుష్ప. ఈ మాస్ యాక్షన్ మూవీ లో అల్లు అర్జున్.. పుష్పరాజ్ అనే పాత్ర లో కనిపించనుండగా రష్మిక కూడా పక్కాగా మాస్ రోల్ లోనే కనిపించనుంది .మొదట ఈ సినిమాని ఒక్క భాగంగా తీద్దాం అనుకున్నప్పటికే కథని మరింతగా విస్తరించే అవకాశం ఉండడంతో ఫైనల్ గా రెండు పార్ట్స్ గా చేయాలని మేకర్స్ భావించారు.
ప్రస్తుతం పుష్ప ది రైజ్ (పార్ట్ 1) షూటింగ్ జరుపుకుంటుండగా, దాదాపు చిత్రీకరణ పూర్తైనట్టు తెలుస్తుంది. క్రిస్మస్ కానుకగా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు.ఇటీవల చిత్ర ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. అయితే ఈ సినిమాకు లీకుల సమస్య ఇబ్బందిగా మారింది. దాక్కో దాక్కో మేక అనే పాటని విడుదల చేసే లోపే ఈ సినిమా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. దీంతో మేకర్స్ షాక్ అయ్యారు. సైబర్ క్రైమ్‌లో కూడా ఫిర్యాదు చేశారు.
పుష్ప సినిమాకు సంబంధించి సాంగ్‌తో పాటు ఫైట్ సన్నివేశాలు,లొకేషన్ సీన్స్ మొత్తం కలిపి 30 నిమిషాలు లీక్ అయినట్టు చెబుతున్నారు. ఇంత పెద్ద సినిమాకు లీకుల బెడద ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పాన్ ఇండియా స్టార్‌గా రూపొందిన పుష్ప చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నారు.