టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పుట్టినరోజు వేడుకలు లైగర్ (Liger)చిత్ర బృందం సమక్షంలో ఘనంగా జరిగాయి. పూరీ జగన్నాథ్ తనకెంతో ఇష్టమైన బాక్సింగ్ దిగ్జజం మైక్ టైసన్ ను లైగర్ లో కీలక పాత్రలో చూపించబోతున్న విషయం తెలిసిందే. అయితే తన పుట్టినరోజు కేక్ మైక్‌టైసన్ (Mike Tyson) కు గుర్తుగా ప్రత్యేకంగా తయారుచేయించి కట్ చేశాడు పూరీ.
ఛార్మీ, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తోపాటు టైలర్ చిత్రబృందం సమక్షంలో కేక్ కట్ చేసిన పూరీకి..అంతా బర్త్ డే విషెస్ తెలియజేశారు. మైక్ టైసన్ ను లైగర్ టీం ఇలా కేక్ సిద్దం చేసి ఆయనకు గొప్ప గౌరవాన్ని అందించింది. మైక్ టైసన్ ఎంట్రీతో లైగర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తుండగా..బాలీవుడ్ (Bollywood) నటి అనన్యపాండే (Ananya Pandey) హీరోయిన్ గా నటిస్తోంది.
పూరీ జగన్నాథ్, ఛార్మీ, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయక్తంగా లైగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్