మూడు రోజులుగా టాస్క్‌లు లేక బోర్‌గా ఫీలవుతున్న కంటెస్టెంట్స్‌కి మళ్లీ టాస్క్‌లు ఆడే అవకాశం కల్పించాడు. తొలి టాస్క్‌లో బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగిలిపోయేలా చూడాలన్న టాస్క్ ఇచ్చాడు. ఇందులో షణ్ను గెలవగా దానిపై అనుమానం వ్యక్తం చేశాడు సన్నీ. లేబుల్ లేదు మచ్చా అనే రెండో టాస్కులో స్విమ్మింగ్ పూల్‌లో ఒకవైపున్న టీషర్ట్ వేసుకుని పూల్‌లో దూకి మరోవైపున్న టీ షర్ట్ వేసుకోవాలి.
ఎవరెక్కువ టీ షర్ట్స్ వేసుకుంటే వారే గెలిచినట్లు. ఈ గేమ్‌లో మానస్, షణ్ముఖ్ పోటీపడగా మానస్ గెలిచాడు.అనంతరం సన్నీ, శ్రీరామ్, మానస్ బంతి గేమ్ ఆడుతుండగా, అది హౌస్‌పై పడటంతో దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలో బిగ్‌బాస్ హెచ్చరించారు. బిగ్‌బాస్ ఇంటిపై ఎక్కాలని ప్రయత్నించడం ఏమాత్రం సహించబడదని వార్నింగ్ ఇచ్చాడు.
అంతేకాదు ముగ్గురికి శిక్షలు కూడా విధించాడు. సన్నీ, శ్రీరామ్, ముగ్గురు కలిసి గార్డెన్ ఏరియాను శుభ్రపరచాలని శిక్ష విధించాడు. శ్రీరామ్, మానస్ అంతా క్లీన్ చేయగా సన్నీ శుభ్రం చేస్తున్నట్లు నటించాడు. అనంతరం ఇంటిసభ్యులందరూ 13 నిమిషాలు లెక్కించాలని మూడో టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో షణ్ను, శ్రీరామ్, మానస్, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లో నిలిచారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన షణ్ను బిర్యానీ గెలుచుకోగా దాన్ని అందరూ ఆరగించారు