e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News ప్రొటీన్ ఎక్కువగా లభించే శాఖాహార పదార్ధాలివే…!

ప్రొటీన్ ఎక్కువగా లభించే శాఖాహార పదార్ధాలివే…!

హైదరాబాద్ , ఆగస్టు :ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం లాంటివి చేయాలి. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం తీసుకోవాలని… దానిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని… అయితే దీనిలో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. శాకాహారులు కూడా శాకాహారంతోనే మంచి ప్రోటీన్స్ ని పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ప్రోటీన్స్ అందుతాయనేది ఇక్కడ తెలుసుకుందాం…!

ప్రొటీన్ ఎక్కువ ఉండే శాఖాహార పదార్ధాలు…

- Advertisement -

బఠానీ…


బఠానీలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బఠానీ ప్రతిరోజూ మీరు తీసుకునే డైట్ చేర్చుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు సులువుగా అందుతాయి.

పప్పులు…


మనం తరచుగా ఉపయోగించే పద్ధతులులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. కనుక శాఖాహారులు వీటిని కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇలా వీటిని తీసుకోవడం వల్ల శాకాహారులకు ప్రోటీన్స్ అందుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.

టోఫు…


ప్రోటీన్ ఎక్కువగా టోఫు లో కూడా ఉంటుంది. ఇది చూడడానికి చీజ్ లాగ ఉంటుంది. దీనికి ఎటువంటి రుచి ఉండదు. మీరు పన్నీర్ తో తయారు చేసుకునే వంటకాలు లాగే దీనిని కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana