e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News Spondylitis diet | రోజూ ఇవి తింటే స్పాండిలైటిస్ స‌మ‌స్య రానే రాదు

Spondylitis diet | రోజూ ఇవి తింటే స్పాండిలైటిస్ స‌మ‌స్య రానే రాదు

Spondylitis diet | రోజురోజుకూ స్పాండిలైటిస్‌ సమస్య పెరుగుతున్నది. మృదులాస్థి (కార్టిలేజ్‌) తరుగుదల, మెడ దగ్గర ఎముకల అరుగుదలనే స్పాండిలైటిస్‌ ( Spondylitis ) అంటారు. ఒకసారి వచ్చిందంటే, వయసుతో పాటు పెరుగుతూనే ఉంటుంది. స్త్రీ, పురుషులిద్దరికీ వచ్చినా.. పురుషుల్లో కాస్తంత ముందుగా కనిపిస్తుంది. పనిచేసే విధానం, మెడ దగ్గర దెబ్బ తగలడం, వంశపారంపర్యత, ఆహారపు అలవాట్లు .. మొదలైనవి సమస్యకు కారణాలు. దీన్ని తగ్గించుకోవడంలో వ్యాయామం ముఖ్య పాత్ర పోషిస్తుంది. క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్లు కూడా పుష్కలంగా తీసుకోవాలి.

spondylitis diet
spondylitis diet

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు

స్పాండిలైటిస్‌ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఒమేగా-3 సప్లిమెంట్లు దోహదపడతాయి. కాబట్టి అవిసె గింజలు, వాల్‌నట్స్‌, చేపలు మొదలైనవి తీసుకోవాలి. పండ్లు-కూరగాయలు ప్యాకేజీ చిరుతిళ్లు ఎలాంటి పోషకాలూ లేని క్యాలరీలను అందిస్తాయి. వాటికి బదులుగా తాజా పండ్లను, ఎండు ఫలాలను అలవాటు చేసుకోవాలి. భోజనంలో కూడా తాజా కూరగాయలను చేర్చుకోవాలి.

మద్యపానం వద్దు

- Advertisement -

పోషకాహారానికి దగ్గర కావడం ఎంత ముఖ్యమో, మద్య పానానికి దూరంగా ఉండటం అంతే అవసరం. పూర్తిగా మానేయడం కష్టమైతే రోజువారీగా మోతాదు తగ్గించాలి. కాలేయం, చిన్నపేగుల లోపలి గోడలు, ఉదర భాగాలను మద్యం పాడుచేస్తుంది. ఫలితంగా ఆహారం సరిగా జీర్ణం కాదు, అవసరమైన పోషకాలు శరీరంలోకి చేరవు.

spondylitis diet

పేగుల గోడలకు..

ఆర్థరైటిస్‌ సమస్యకు వాడే కొన్ని మందుల ప్రభావం వల్ల పేగుల గోడలు దెబ్బ తింటాయి. కాబట్టి, అరటిపండ్లు, పెరుగు పుష్కలంగా తీసుకోవాలి. ఈ రెండిటినీ కలిపి స్మూతీగా చేసుకుని రోజుకోపూట తింటే మంచిది. పొట్టు తీయని గింజల పిండితో చేసే బ్రెడ్‌, చపాతీలు తీసుకోవాలి.

క్యాల్షియం

స్పాండిలైటిస్‌ తీవ్రతను తగ్గించేందుకు క్యాల్షియం బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం పాలు, చీజ్‌, బాదం, పప్పు దినుసులు, సోయా పాలు, మీల్‌మేకర్‌ వంటిని తినాలి.

spondylitis diet

డైట్‌ ప్లాన్‌ ముఖ్యం..

  • ఉదయం లేవగానే ఒక గ్లాసు నిమ్మరసం, ఐదు నానబెట్టిన బాదం గింజలు తీసుకోవాలి.
  • అల్పాహారంగా ఒక కప్పు బొప్పాయి ముక్కలు, పుదీనా చట్నీతో పెసరట్టు తినాలి.
  • పదకొండు గంటల సమయంలో అల్లం కలిపిన బీట్‌రూట్‌ రసం ఒక గ్లాసు తాగాలి. దాంతోపాటు రెండు వాల్‌నట్స్‌ తీసుకోవాలి.
  • మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలతో ఒకటిన్నర కప్పు అన్నం, రాజ్మా కూర, ఒక కప్పు ఏదైనా కూరగాయతో చేసిన కూర, కప్పు పెరుగు చేర్చుకోవాలి.
  • సాయంత్రం దానిమ్మ, సబ్జా గింజలు, అవిసె గింజలు ఒక్కో టేబుల్‌స్పూన్‌ చొప్పున తీసుకోవాలి.
  • రాత్రి భోజనంలో మీల్‌మేకర్‌, టమాట కూరతో రెండు చపాతీలు తినాలి.

మయూరి ఆవుల, న్యూట్రిషనిస్ట్‌, Mayuri@trudiet.in

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Back pain | సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌ను ఎక్కువ‌గా వేధిస్తున్న ఈ స‌మ‌స్య‌ను ఎలా జ‌యించాలి?

Spondylitis | వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి..

Omicron | ఒమిక్రాన్ పిల్ల‌లపై ప్ర‌భావం చూపిస్తుందా? ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలేంటి?

మునగతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలిస్తే తిన‌కుండా ఉండ‌లేరు

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement