హైదరాబాద్: నగరంలోని సీఎస్ఐఆర్- నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 24 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత ఆధారంగా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 54
ఇందులో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 2, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 3, ప్రాజెక్ట్ అసోసియేట్ 42, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 5, జేఆర్ఎఫ్ 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీకాం, బీఎస్సీ, బీఈ లేదా బీటెక్, పీజీ, ఎంటెక్, పీహెచ్డీ, నెట్ లేదా గేట్ అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్యూ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: మే 10
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: www.ngri.org.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి