న్యూఢిల్లీ: సీఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్‌డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్ 4, ఫీల్డ్ అసిస్టెంట్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కెమిస్త్రీ, బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్స్, మెకానికల్ డిప్లొమా, కెమికల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 24
వెబ్సైట్: www.niist.res.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి