కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా నటిస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. శ్రీధర్ గాదె దర్శకత్వం వహిస్తున్నారు. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత కోడి దివ్యదీప్తి. ఆమె మాట్లాడుతూ…‘మంచి కుటుంబ కథా చిత్రమిది.
మన జీవితాలతో ముడిపడి ఉండే ఒక కీలకమైన అంశాన్ని కథలో చూపిస్తున్నాం. పూర్తి కమర్షియాలిటితో సినిమా సాగుతుంది. తండ్రీకూతురు మధ్య ఉండే అనుబంధాలు ఆకట్టుకుంటాయి. బాబా భాస్కర్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పాత్రలు మెప్పిస్తాయి. మణిశర్మ మంచి సంగీతాన్ని అందించారు. ఆయన నేపథ్య సంగీతం కూడా బాగా వచ్చింది. కిరణ్ అబ్బవరం సినిమాకు బాగా సహకారం అందించాడు. ఆయన రాసిన డైలాగ్స్ సినిమాకు ఆకర్షణ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశాం. సినిమా ఔట్పుట్ బాగుంది. విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. నాన్నగారి లాగే నాకూ దర్శకత్వం అంటే ఇష్టం. రెండు మూడు కథలు సిద్ధం చేసుకున్నా. త్వరలోనే నా డైరెక్షన్లో సినిమా చేస్తా’ అని చెప్పింది.