హిందీ చిత్రసీమలో అగ్ర తారగా వెలుగొందుతున్న తరుణంలోనే హాలీవుడ్ వైపు అడుగులు వేసింది ప్రియాంకచోప్రా. అక్కడ ఎలాంటి సిఫార్సులు లేకున్నా స్వశక్తితో అవకాశాల్ని సొంతం చేసుకుంది. అయితే తన హాలీవుడ్ జర్నీ అనుకున్నంత సవ్యంగా జరగలేదని చెప్పింది ప్రియాంకచోప్రా. అక్కడి ఇండస్ట్రీలోని వర్ణ వివక్ష కంటే దక్షిణాసియా సినీరంగం వారి నుంచే ఎక్కువ అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పింది. ‘ఒకే జాతి, సంస్కృతిసంప్రదాయాల నేపథ్యం నుంచి వచ్చిన వారందరూ మనతో సఖ్యతను ప్రదర్శిస్తారనుకోవడం ఒట్టి భ్రమ. హాలీవుడ్లో స్వజాతీయులే నాకు ఆటంకాలు సృష్టించారు. భారత్ నుంచి వచ్చి హాలీవుడ్లో తారగా వెలిగిపోవాలనుకోవడం తీరని కల అంటూ నిరుత్సాహపరిచేవారు. మనవారు నెగెటివ్‌గా ఆలోచిస్తారని ఊహించలేదు. అయితే ఏ వేదికమీదైనా ఆశావాదంతో ముందుకుసాగితే విజయం తప్పక వరిస్తుంది’ అని చెప్పింది ప్రియాంకచోప్రా.