అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న భారతీయ నటీమణుల్లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఒకరు. హాలీవుడ్ చిత్రాల్లో కూడా కనిపించిన ఆమె.. బాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఆ తర్వాత ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. నిక్ జోనాస్ మ్యూజిక్ వీడియోల్లో కూడా ఒక్కోసారి మెరిసింది.
పెళ్లయిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరును ‘ప్రియాంకా చోప్రా జోనాస్’గా మార్చుకుంది. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి దీపావళి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత స్నేహితులందరికీ దీపావళి పార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఏమైందో సడెన్‌గా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు చివర భర్త పేరు తీసేసిందీ బ్యూటీ.
‘ప్రియాక చోప్రా’ అని మాత్రమే ఉంచింది. దీంతో ఆమె అభిమానులంతా? భార్యాభర్తల మద్య గొడవలేమైనా జరిగాయా? అని భయపడుతున్నారు.