PMO : ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును కేంద్ర ప్రభుత్వం సేవాతీర్థ్ (Seva Theerth) గా మార్చింది. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనానికి ఈ నామకరణం చేసింది. ప్రధాన మంత్రి కార్యాలయం పేరును సేవాతీర్థ్‌గా, రాజ్‌భవన్ (Raj Bhavan) పేరును లోక్‌భవన్ (Lok Bhavan) గా మారుస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నవంబర్ 25న ఒక ప్రకటన జారీచేసింది.
ఆ మేరకు ఇవాళ పీఎంఓకు సేవాతీర్థ్‌గా నామకరణం చేసినట్లు కేంద్రం తెలిపింది. అదేవిధంగా కేంద్రం నిర్ణయం మేరకు ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ రాష్ట్రంలోని రాజ్‌భవన్‌కు లోక్‌భవన్‌గా పేరు మార్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చనుంది. ఈ మేరకు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.